హైదరాబాద్ కార్ఖానాలోని లాస్యనందిత నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత పార్థివ దేహానికి పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించి, లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూతురు చనిపోయిందన్న బాధలో కన్నీరుమున్నీరవుతోన్న లాస్య కుటుంబ సభ్యులకు కెసిఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లాస్యనందిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి లాస్యనందిత భౌతికాయానికి నివాళులు అర్పించనున్నారు. ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారేడుపల్లిలోని దివంగత ఎమ్మెల్యే, తండ్రి సాయన్న సమాధి పక్కనే లాస్యనందిత అంత్యక్రియలు జరగనున్నాయి.
బ్రేకింగ్ న్యూస్: ఎమ్మెల్యే పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ సీఎం.
February 23, 2024
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో ఈరోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే.
Tags