DBN TELUGU: భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రఘనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ కు ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎటువంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో, ఎటువంటి నాయకుడైతే పేదల కష్టాలు తీరుస్తాడో అటువంటి నాయకుని చూసి రానున్న ఎన్నికలలో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయనతోపాటు మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘనాథ్, నియోజకవర్గ, మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.