Type Here to Get Search Results !

మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

DBN TELUGU:- 


- మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే షేక్ అంజుమ్ 9వ తరగతి విద్యార్థిని మృతి.


- విద్యార్థిని మరణంకు కారకులైన గురుకుల ప్రిన్సిపాల్, ANM సిబ్బంది పై వెంటనే చర్యలు తీసుకోవాలి.


- ముస్లిమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.



కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బబాపుర్ మైనార్టీ  గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ANM మరియు సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దానితో మైనారిటీ రెసిడెన్స్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ఏఎన్ఎం సిబ్బంది చేసేదే ఆటగా చెప్పిందే పాటగా కొనసాగుతుంది. దానితో అధికార యంత్రాంగము తుతూమంత్రంగా కొద్ది రోజులు పర్యవేక్షణ చేసి మళ్లీ యధాస్థితికి వచ్చారు. దానితో వసతి గృహాల్లో పనిచేస్తున్న వారిది ఇష్టారాజ్యం కావడం విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం పెట్టకపోవడం నాసిరకమైన మెనూ పాటించడంతో  విద్యార్థులు అనారోగ్యాలతో మరణిస్తున్నారు. అలాగే నిన్న కాక మొన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో షేక్ అంజుమ్ 9వ తరగతి విద్యార్థిని రక్తహీనత లోపించి రక్త కణాలు తగ్గి జ్వరంతో బాధపడి మృతి చెందింది. దీనికి పూర్తి బాధ్యులు మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ ఏఎన్ఎం సిబ్బంది కారణం ఏమిటంటే విద్యార్థినికి జ్వరం వచ్చి కొన్ని రోజులు గడిచాక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లండి అనడంతో తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆ విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించడంతో అక్కడి డాక్టర్లు విద్యార్థినికి గత కొద్ది రోజుల నుంచి జ్వరం వస్తుంది, రక్త కణాలు పడిపోయాయి అని చెప్పారు. ఇలా ఆరోగ్యం క్షీణించి విద్యార్థిని మృతి చెందింది. దీనికి కారణం అయిన మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్, ఏఎన్ఎం సిబ్బంది వారిపై పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారిపై చర్యలు తీసుకుంటామాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సలహాదారుడు సయ్యద్ నిసార్ అధ్యక్షులు ఉబైద్ బిన్ యహియ(తారిక్), ఇస్లాం బక్రబే, అమర్ బిన్ అబ్దుల్లా, కశీఫ్ హష్మీ, అబ్దుల్ అఫ్జల్ (ఫైసల్) తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.