DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సాయన్న కూతురుగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన 37 సంవత్సరాలు ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కాసేపటి క్రితం మృతి చెందారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలతో బయటపడ్డ లాస్య నందిత పది రోజుల వ్యవధిలోనే మరోసారి రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. దీంతో గులాబీ పార్టీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కంటైన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి… సాయన్న గత ఏడాది చనిపోయాడు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత కూడా మరణించారు.