Type Here to Get Search Results !

బొగ్గు 100% ఉత్పత్తి కోసం కృషిచేసిన కార్మికులకు సన్మానం.

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని లో శుక్రవారం మొదటి షిఫ్ట్ లో జనవరి నెలలో 100% ఉత్పత్తి ఆర్కే 7 గని సాధించినందున ఉత్పత్తి కోసం కృషి చేసిన ఎస్ డి ఎల్ ఆపరేటర్ మధు, కోల్ కట్టర్స్ మల్లేష్, విజయ్, మహేష్, సత్తయ్య, సపోర్ట్మన్స్ జోగేందర్ ప్రసాద్, రాజమల్లు, షకీల్, టబ్పుషార్స్ మహేందర్, ట్రామ్మర్ నాగరాజు లను బహుమతితో పాటు శాలువతో ఆర్ కే 7 గ్రూప్ ఏజెంట్ రాముడు, ఆర్ కే 7 గని DYGM సాయిప్రసాద్ ఘనంగా సత్కరించారు.






ఈ సందర్భంగా ఏజెంట్ రాముడు మాట్లాడుతూ... ఆర్కే 7 గని జనవరి నెలలో 100% ఉత్పత్తి సాధించిందని, ఉత్పత్తి సాధనలో ప్రతి ఒక్క కార్మికుని కృషి ఉందని రానున్న రెండు నెలల్లో ఇదేవిధంగా సేఫ్టీ నియమాలు పాటిస్తూ 100% ఉత్పత్తి సాధించి శ్రీరాంపూర్ ఏరియాలోనే ఉత్తమ గని గా మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా డివైజియం సాయి సాయిప్రసాద్ మాట్లాడుతూ... శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 7 గని ఉద్యోగులకు మంచి పేరు ఉందని, ఉత్పత్తి సాధనలో కార్మికుల యొక్క కృషి ఫలితంగానే జనవరి నెలలో 100% ఉత్పత్తి సాధించామని, ఉత్పత్తి సాధనలో కాకుండా సేఫ్టీ నియమాలు పాటించడంలో ఆర్కే 7 గని కి ఏరియాలోనే మంచి గుర్తింపు ఉందని రానున్న రెండు మాసాలలో 100 శాతం ఉత్పత్తి కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి రవిశంకర్, సంక్షేమ అధికారి సంతన్, అండర్ మేనేజర్లు రవీందర్, రవి తేజ, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, ఏఐటీయూసీ గుర్తింపు సంఘం నేతలు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టై కిషన్ రావు, పిట్ సెక్రెటరీ బేర రవీందర్, ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.