DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గంజాయితో పట్టుపడ్డ ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ విగ్రహం హైవే దగ్గరలో పోలీసులు వాహనాల తనిఖీలు చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా స్కూటీ డిక్కీలో 950 గ్రాములు గంజాయి లభ్యమయింది. గంజాయితో పట్టుపడ్డ యువకుల వివరాలు చూసుకుంటే పైడిమల్ల పృధ్వీరాజ్ r/o post ఆఫీస్ బస్తి మరియు రామ్ శ్రిమిత్ర r/o టేకులబస్తి కి సంబంధించిన వారిగా తెలిపారు. ఇందులో భాగంగానే వారిని విచారించగా గత కొంత కాలంగా చంద్రపూర్ నుండి తక్కువ ధరకు గంజాయి కొనుక్కోవచ్చి బెల్లంపల్లి లోని యువకులకు ఎక్కువ రేటుకు విక్రయించడమే గాక వారు కూడా గంజాయి సేవిస్తున్నట్లు విచారణలో చెప్పారు. పంచనామా నిర్వహించిన అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా... బెల్లంపల్లి వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ... పట్టణంలో యువకులు ఎవరైనా గంజాయి సేవించనా మరియు గంజాయి సరఫరా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అంతేగాక పి.డి. యాక్టు నమోదు చేయడం జరుగుతుంది, గంజాయి రవాణా గురించి గాని సేవించే వారి గురించి గాని ఎవరికైన తెలిసిన యెడల పోలీస్ వారికీ తెలియజేయాలని సూచించారు.
