DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఈ రోజు సోమగూడెం న్యూ కాలని, పెద్దనపల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ వేముల కృష్ణ ఏర్పాటు చేసిన 4- సీసీ కెమెరాల ను ప్రారంబించనైనది.
సర్పంచ్ వేముల కృష్ణ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసినారు. ఈ సందర్బంగా ఎస్ఐ గంగారాం మాట్లాడితూ... పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలు, వ్యాపారస్థులు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలను సురక్షితంగా, నేరారహిత గ్రామాలుగా ఉంచుకోగలరని ప్రజలకు తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏయస్ఐ రవీందర్, ముఖ్య అతిథిగా సినిమా రచయిత, నటులు గడ్డం సురేష్, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, కంచర్ల పద్మ, బన్న హిందుమతి, గ్రామస్తులు బన్న శ్రీనివాస్, శ్రీధర్, శ్యాం, నరేష్ కారోబార్ మురళిలు పాల్గొన్నారు.