Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: 4న సిఓఈ ఎంట్రెన్స్ టెస్ట్: ఆర్సీఓ.

DBN TELUGU:- 4న సిఓఈ ఎంట్రెన్స్ టెస్ట్.


- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు.


- పోలీస్ స్టేషన్స్ లో భద్రపరిచిన ప్రశ్నా పత్రాలు.   


- హాజరుకానున్న 5918 మంది విద్యార్ధులు.    



  



ఈ నెల 4న జరగనున్న సిఓఈ సెట్ కు పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు ఆదిలాబాద్ రీజియన్ ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులుతో కలిసి పరీక్షకు సంబందించిన పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఆదిలాబాద్ రీజియన్ లోని మూడు (ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల) జిల్లాల్లో 5918 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హజరవుతున్నారన్నారు.   


పరీక్షా కేంద్రాల వారీగా విద్యార్ధుల వివరాలు:- 

ఆదిలాబాద్ జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు 1723 మంది విద్యార్ధులు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు 1495 మంది విద్యార్ధులు. 

మంచిర్యాల జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలు 2700 మంది విద్యార్ధులు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. గంట ముందే పరీక్షా హాల్ లోకి అనుంతిస్తారని ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.