DBN TELUGU:-
- సైన్స్ పరిశోధనల్లో సి వి రామన్ సేవలు ఉత్తమమైయినవి.
- బెల్లంపల్లి సి ఓ ఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు.
భౌతిక శాస్త్రంలో ప్రపంచాన్ని భారతదేశం వైపుకు మళ్లించే రామన్ ఎఫెక్ట్ ప్రకటించిన ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ దినోత్సవం గా జరుపుకోవడం ఆయన కృషికి ఘనమైన నివాళి అన్నారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ ప్రదర్శనను గొప్పగా ఆలోచనత్మకంగా విశ్లేషించడం మంచి పరిణామం అన్నారు. రాబోవు తరాలకు గొప్ప సైన్స్ ఫలితాలను ఇవ్వడానికి నేటి తరం ఉపాధ్యాయులు సివి రామన్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఒక తరం త్యాగమే తర్వాత తరాన్ని వెలుగుల్లోకి తీసుకుపోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ముందుగా సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక శాస్త్రవేత్త సి.వి రామన్ సైన్స్ లో చేసిన ప్రయోగాలు చిరస్మరణీయం అన్నారు.
-బహుమతుల అందజేత.
బయాలజీ, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర విభాగాల్లో ఉత్తమ సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదే విధంగా సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ ,క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజ్ కుమార్, జెవిపి పొన్నం శ్రీనివాస్, సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు పొన్నాల రాజ్ కుమార్, కాసర్ల రాజేందర్, యండి.కౌసర్, రంగంశెట్టి శ్యామల, యాసాని హారిక, సింగారావు స్రవంతి, అధ్యాపకులు పిన్నింటి కిరణ్, చందా లక్ష్మీనారాయణ, ఆకినేపల్లి రాజేష్, కట్ల రవీందర్, ముద్దసాని శోభ, యండి. రఫీ, అనుముల అనిరుద్ తదితరులు పాల్గొన్నారు.