DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
బెల్లంపల్లి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో బెల్లంపల్లి మరియు కాసిపేట మరియు నెన్నెల మండలాలకు సంబంధించిన 233 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేద, ఆడబిడ్డ ల ఉన్న కుటుంబాలకు ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలల అధ్యక్షులు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అధికారులు పాల్గొన్నారు.