స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే... దేవాపూర్ చెక్ పోస్ట్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో జైనథ్ మండలం కేంద్రానికి చెందిన చౌదరి రవీందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కారును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. అంతకు ముందు రవీంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ మార్చరీకి తరలించినట్లు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్: ద్విచక్రాన్ని ఢీకొట్టిన కారు... ఒక్కరు మృతి...!
February 20, 2024
0
DBN TELUGU:- అదిలాబాద్ జిల్లాలో దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద అతిక వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరు తీవ్ర గాయాలు పాలయ్యారు.
Tags