DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోనే ఘనంగా నిర్వహించే జాతరలలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో భాగంగానే కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేటు ముందర ఆదివాసి నాయక పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర గోడ ప్రతులను మండల అధ్యక్షురాలు రోడ్డలక్ష్మి ఆదివాసి సంఘాల నాయకులు ఓరియంట్ సిమెంట్ పర్సనల్ మేనేజర్ కులకర్ణి, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, నాయక్ పోడుసేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్ చే తుల మీదుగా గోడప్రతులను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మండలంలోని ఆదివాసీలు గిరిజనలు అన్ని వర్గాల వారు జాతరకు విచ్చేసి విజయవంతం చేయగలరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రోడ్డ రాజం, గ్రామ పటేల్ ఆడ జంగు, మాజీ సర్పంచ్ రెడ్డి లక్ష్మణ్. సంస్కృతిక కార్యదర్శి గడ్డం భీమయ్య గ్రామ కమిటీ, రమణ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, కలవేని శ్రావణ్ సోయం సూరు కార్మిక సంఘ నాయకులు, కనక రాజు, తుడుం దెబ్బ జిల్లా నాయకులు రొడ్డ రవీందర్, బద్ది శ్రీనివాస్ రోడ్డ అనిల్, రెడ్డి భారతి నాయుడు మల్లేష్ బద్ది మల్లికార్జున్ కో ల కానీ రంజిత్, కొమ్ముల రాంచందర్, భీమిని మహేందర్ రోడ్డ మల్లేష్ రోడ్డ లచ్చులు తదితరులు పాల్గొన్నారు.
