DBN TELUGU:- మంచిర్యాల
జిల్లాలోని తాండూర్ మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే తాండూర్ మండలంలోని మాదారం గ్రామంలో ఎన్ఆర్ఈజీస ఫండ్స్ ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.


