DBN TELUGU:- తిర్యానీ మండలంలోని ఉల్లి పిట్ట బ్రిడ్జి దగ్గర మూలమలుపు వద్ద గురువారం సాయంత్రం ఆటో బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చిర్రకుంట జి.పి లోని రింగన్ గూడ నుండి దంతంపల్లి భీమయ్య జాతరకు వస్తుండగా ఉల్లిపిట్ట మూల మలుపు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఐనట్టు సమాచారం. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.