DBN TELUGU:- హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే... ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్‌పేట గ్రామ శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టంమీద బయటకు తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను మంతెన కాంతయ్య, శంకర్, భరత్, చందనగా గుర్తించారు. వారంతా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందినవారని, వేములవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి మంచు ఎక్కువ ఉండటంతో దీంతో అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఏటూరు నాగారంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.