DBN TELUGU:- స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ) జాతీయస్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి లో 9వ తరగతి చదువుతున్న వేల్పుల రోహిత్ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అయినా నా సైదులు తెలిపారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో జిల్లా, జోనల్, మరియు రాష్ట్రస్థాయిలో జరిగిన బేస్ బాల్ క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 18 వ తేదీన మహబూబాబాబ్ జిల్లా తొర్రూర్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులో వేల్పుల రోహిత్ కీలకంగా ఆడడం పట్ల ప్రిన్సిపల్ ఆనందం వ్యక్తం చేశారు.
- ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టులో కీలక పాత్ర పోషించి జట్టును కాంస్య పథకం సాధించేంత ఉత్తమంగా రోహిత్ ప్రదర్శన ఉండడం అభినందనీయమని ఎస్ జి ఎఫ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి పి పరిమళ అన్నారు.
- జనవరి 2 వ తేదీ నుంచి 5 వరకు చత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రోహిత్ రాష్ట్రస్థాయి జట్టుతో కలిసి బయలుదేరి నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ పి. పరిమిల, పిడి , పి ఈ టి లు అల్లూరి వామన్ ,నడిగొట్టి రాకేష్ లు విద్యార్థి తోపాటు తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రోహిత్ తల్లిదండ్రులు భూమక్క-కిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, జె వి పి కొక్కుల రాజేశ్వర్ ఉపాధ్యాయులు దత్త ప్రసాద్, శ్యాంసుందర్, వరమని ప్రమోద్ కుమార్, పొన్నం శ్రీనివాస్, కొఠారి రాజేశం గోదారి రాజశేఖర్, ఇరుగు రాళ్ల మల్లేష్, కొరళ్ళ శివ తేజస్వి తదితరులు పాల్గొన్నారు.