Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల: సీఎం.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.





ఈ సందర్భంగా వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు నేటినుండే రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.