DBN TELUGU:-
- ములుగు జిల్లాలో గురువారం ఉదయం తీవ్ర విషాదం.
- అంబులెన్స్ బురదలో ఇరుక్క పోవడమే కారణం.
- గర్భిణిని తరలిస్తున్న అంబు లెన్స్..వానకు చిత్తడిగా మారిన బురుద రోడ్డులో కూరుకుపోవడంతో మహిళ కడుపులోని బిడ్డ మృతి చెందింది.
-- వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లాలోని కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు మొదలవుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే, రాంనగర్ నుండి కమలాపురం వెళ్లేదారిలో వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో, స్థానికులు వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు.
ఈ క్రమంలో గర్భిణీ మహిళను ఆసుపత్రికి తరలింపులో చాలా ఆలస్యం జరగడంతో ఆమె కడుపులోని శిశువు ఉమ్మనీరు మింగి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.