DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో నడిరోడ్డుపై ద్విచక్ర వాహనం, వ్యక్తి దహనమైన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కన్నాల జాతీయ రహదారిపై ఫ్లెఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒకసారిగా మంటలు చెలరేగి ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోగా... దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని యొక్క పూర్తి వివరాలు తెలియాల్సింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.