DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో ఫాంహౌజ్‌లోని బాత్రూములో కాలుజారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హుటాహుటిన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేటీఆర్ కుటుంబంతోపాటు హరీష్ రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత... కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్ కు యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్లు చేసిన తర్వాత హెల్త్ బులెటిన్ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.