DBN TELUGU:- బెల్లంపల్లి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారంకాసిపేట మండలంలోని మామిడిగూడ గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు కానుకగా కెసిఆర్ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సంపత్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగవత్ భాస్కర్, సభ్యురాలు నగవత్ పద్మ, పంచాయతీ కార్యదర్శి శ్వేత , రేషన్ డీలర్ అశోక్, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, ఆడపడుచులు పాల్గొన్నారు.
