DBN TELUGU:- మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురై ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలైన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తుల మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
