DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే
గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 09వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం.గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... కళాశాలలో కామర్స్(టాక్సషన్ )- పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ,నెట్ /స్లెట్/సెట్/పీ హెచ్ డి అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అలాగే పీజీలో 55 మార్కులతో ఉత్తీర్ణులై, డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.
