DBN TELUGU:-
- ఇండియన్ ఆర్మీలో సోల్జర్ గా ఉద్యోగం పొందిన బెల్లంపల్లి సి ఓ ఈ విద్యార్థి.
- అభినందించిన బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య.
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సి ఓ ఈ విద్యార్థి తాళ్ల పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ లో సోల్జర్ గా ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సైదులు తెలిపారు. ఏప్రిల్ 17 రాత పరీక్షకు హాజరైన పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిభ చూపి ఫిజికల్ మరియు మెడికల్ టెస్ట్లకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 3న ఫిజికల్ టెస్టులలో భాగంగా జరిగిన ఈవెంట్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి తుది పరీక్ష ఫలితాల్లో సోల్జర్ గా ఉద్యోగం సాధించి బెల్లంపల్లి సత్తా చాటాడు. ఈ సందర్భంగా శుక్రవారం సిఓఈ ఆవరణలో పవణ్ కల్యాణ్ ను మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, ప్రిన్సిపాల్ ఐనాల సైదులుతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని పలు దశల్లో జరిగిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తుది ఫలితాల్లో ఇండియన్ ఆర్మీలో జనరల్ డ్యూటీ సోల్జర్ గా ఎంపిక ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇప్పటికే సి ఓ ఈ నుండి ముగ్గురు విద్యార్థులు ఇండియన్ ఆర్మీలోను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్స్ గా నలుగురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంపట్ల పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తురకలకుంట గ్రామం, పెద్దపల్లి జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు తాళ్ల రేవతి-నరసయ్యలు రోజుకూలి చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. బెల్లంపల్లి సిఓఈ లో అడ్మిషన్ పొందిన తాళ్ల పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ ఎంపిసి లో 906 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్ విద్యతోపాటు ప్రత్యేక శిక్షణపొంది క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయి అథ్లెటిక్స్ లో అనేక బహుమతులు సాధించాడు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పుదారి నగేష్, పెరుగు తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, నడిగొట్టి రాకేష్ కుమలర్, డి.రాజలింగు, కె.భాస్కర్, సివిల్ కాంట్రాక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
