DBN TELUGU:- మంచిర్యాల జిల్లా
కేంద్రం నుండి బెల్లంపల్లి మీదుగా ముత్తపూర్ వయ బుయ్యారం నుండి వేమణపల్లి వరకుబెల్లంపల్లి నుండి నెన్నేల మీదుగా కోనంపేట కి బస్ పునఃప్రారంభం చేయాలని కోరుతూ డీ.ఎం రవీందర్ కి బెల్లంపల్లి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాంటెంకి శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేమనపల్లి మండలం నుండి బెల్లంపల్లి కి రావాలి అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చెన్నూర్, మంచిర్యాల నుండి చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది, నెన్నేల మండలం కొనంపేట గ్రామానికి బస్ లేదని యువకులు పలు మార్లు విన్నవించగ 8నెలలు బస్ ఏర్పాటు చేశారు. అనంతరం నిలిపి వేశారు, ప్రయివేటు వాహనాల్లో అధిక ధరల వల్ల ప్రయాణికులు, నిరు పేద విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారు. బస్ వచ్చిన అన్ని రోజులు ప్రజలు చాలా సంతోష పడ్డారు ఈ దసరా పండుగ సందర్భంగా సెలవులకు విద్యార్థులు, యువకులు ఊర్లకు వస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, బస్ పునః ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఆర్టీసీ డీఎం సానుకూలంగా స్పందించి వేమణపల్లి కి త్వరలోనే బస్ ఏర్పాటు చేస్తాం, కొనంపేటకి వెహికల్ రూట్ చెక్ చేసి ఉన్నత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి. డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఓ. యు జేఏసీ కో ఆర్డినేటర్ దుర్గం మల్లేష్ పాల్గొన్నారు.
