DBN TELUGU:- భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల నూతన కమిటీల నియామకాన్ని కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ నియమించారు.
మండల కమిటీ లో భాగంగా మండల ప్రధాన కార్యదర్శిగా భుక్య అరవింద్, దేవనురి సంతోష్ మండల ఉపాధ్యక్షులుగా బాకీ నరేష్, రెడ్డి బాలరాజు, ఏదుల తిరుపతి, పెద్దపల్లి శంకర్ మండల కార్యదర్శిగా జాడి రాజ్ కుమార్, బాకీ కిరణ్ మండల కోశాధికారిగా రత్నం కృష్ణ, యువ మోర్చా అధ్యక్షులుగా నాగరారపు ప్రసన్న, గిరిజన మోర్చా అధ్యక్షులుగా భూక్య ప్రవీణ్, మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా షేక్ యూసఫ్, మహిళా మోర్చా అధ్యక్షులుగా దాగం లీల, ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా మారం రంజిత్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా పొలవెని పోషం లను నియమించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమందా రమేష్ మాట్లాడుతూ... ఇట్టి నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయి మరియు నియమితులైన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రచార్ల సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేవెల్లి రాయలింగు తదితరులు పాల్గొన్నారు.
