DBN TELUGU:- మాజీమంత్రి ,కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఆశావాహ అభ్యర్థి గడ్డం వినోద్ ఓ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేసిన అశ్లీల వీడియోల చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో బూతు వీడియోలు పోస్ట్ చేయడంతో ఆ గ్రూపులో ఉన్న సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా మేల్కొన్న వినోద్ వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేశారు. మహిళలపై అమితమైన గౌరవం ఉందని చెప్పే గడ్డం వినోద్ ఇటువంటి పోస్ట్ చేయడం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా ఆ వీడియోల స్క్రీన్ షాట్ లు వైరల్ అవుతున్నాయి. జిల్లా స్థాయి వాట్సాప్ గ్రూప్ కావడం అందులో మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్న గ్రూపులో ఇలాంటి అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడం సిగ్గుచేటు అని పలువురు అభిప్రాయపడగా, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని గడ్డం వినోద్ ఇలాంటి అశ్లీల వేడియో లు షేర్ చేసారని మండిపడుతున్నారు.
