- రాజకీయాల్లోకి ఎంట్రీ...!
-- ఆదివాసీ తెగలకు చెందిన సోయం బాపూరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదిమ గిరిజనులను ఏకం చేసే తుడుందెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో కేసీఆర్ పై ఒక సందర్భంలో తిరుగుబాటు చేసి టిఆర్ఎస్ టికెట్ సాధించి విజయం సాధించారు. అలాగే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో నెలల వ్యవధిలోనే బీజేపీలో చేరి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఏ పార్టీలో ఉన్నా తాను నమ్ముకున్న ఆదివాసీల కోసం పనిచేస్తాడన్న పేరును ఆయన పొందారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహాన్ని సోయం బాపూరావు మార్చుకున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం మొదలైంది.
- సోయం చేరడం ఖాయమే...?
-- ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో సోయం బాపూరావు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారని జరుగుతున్న ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన బోడ్ లేదా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రధాని పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సోయం బాపూరావు బిజెపి నీ వీడితే బోత్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాషాయ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
