DBN TELUGU:- తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి KTR చెన్నూరు నియోజకవర్గం కి వస్తున్నారని ముందస్తు అరెస్టులో భాగంగా బిజెపి కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ 6:30 గంటలకు పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టు చేసి, కాసిపెట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా అక్రమ అరెస్టులు చేయడం సరికాదని, రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయమని తెలిపారు. వారితోపాటు మండల ఉపాధ్యక్షులు పొలవేణి పోశం మరియు దేవపుర్ పోలీస్ స్టేషన్లో మండల ప్రధాన కార్యదర్శి దేవినూరి సంతోష్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రమేష్, బిజెపి నాయకులు రెడ్డి బాలరాజు, సదయ్య, రామచందర్ లను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

