DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణంలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైవ సల్లెం జన్మదినం సందర్బంగా పట్టణ కేంద్రంలోని ముస్లిం సోదరులు భారీ ఎత్తున జులుస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్బంగా తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థపాక అధ్యక్షులు ఉస్మాన్ పాషా అతని బృందంతో కలిసి యాచకులకు పండ్లు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ... మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ముస్లిం సోదరులు అత్యంత పవిత్ర రోజుగా భావించే ఈ రోజు నలుగురి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అదే విధంగా భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ప్రతీ భారతీయ పౌరుడు ముందుకు సాగాలని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా నిత్యం మనం ఇలాగే కలిసి మెలిసి ఉండాలని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు గౌస్, ఫరీద్, హాజి, వాజిద్, సోను, ఉమేర్ నవాజ్, సాహిల్ తదితరులు పాల్గొన్నారు.

