DBN TELUGU:-
- స్నేహితులే శత్రువులుగా మారిన సన్నివేశం.
- గంజాయి మత్తులో స్నేహితుడినే హతమార్చే కుట్ర.
గంజాయి మత్తులో స్నేహితుల గా ఉన్నవారు శత్రువులుగా మారిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నితిన్, విష్ణు ఇద్దరూ స్నేహితులు. ఇద్దరు కలిసి ఫుల్లుగా గంజాయి సేవించి ఈ క్రమంలో గంజాయి మత్తులో ఉన్న నితిన్ స్నేహితుడైన విష్ణు గొంతి కోసి పారిపోయాడు. గాయపడిన విష్ణును సహచరులు ఆస్పత్రికి తరలించారు. గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు. గంజాయి మత్తు వదిలిన తర్వాత తీవ్ర భయాందోళనకు గురైన నితిన్ ఎవరికీ దొరకకుండా పరారయ్యాడు. పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
