DBN TELUGU:- తాటి చెట్టు పై నుండి కింద పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన మద్దిరాల మండల పరిధిలోని చిన్నేముల గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... చిన్నముల గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు (38) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో తాటిచెట్టు పై నుండి ఒకేసారి గా కింద పడడంతో అక్కడికి అక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. శవపరీక్షల నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
