DBN TELUGU:-
- సిఓఈ లో చురుకుగా జోనల్ గేమ్స్ ఏర్పాట్లు.
- ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల 13 నుండి 16 వరకు నాలుగు రోజులపాటు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ లో జరగనున్న 9వ జోనల్ లెవెల్ క్రీడా పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఏర్పాట్లను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తో కలిసి పరిశీలించారు.
4రోజుల పాటు జోన్ 1 కు చెందిన కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లోని గురుకుల బాయ్స్ ఈ పోటీలకు హాజరు కానున్నట్లు ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేకు వివరించారు. క్రీడా మదానంలో చదును చేసే పనులను ప్రిన్సిపల్ ఐనాల సైదులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం క్రీడా పోటీల నిర్వహణ విషయమై పలు విషయాలను ఉపాధ్యాయులతో చర్చించారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి కెసిఆర్ క్రీడలపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారనడానికి నిదర్శనం సంక్షేమ గురుకులాల ఆద్వర్యంలో ప్రత్యేక అకాడమీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా వేల మంది పిల్లలకు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించడమేనన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని సంక్షేమ గురుకులాల పిల్లలు అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో రజిత పథకం సాధించిన నందిని విజయాలను గుర్తు చేసుకున్నారు. క్రీడా రత్నాలను తయారు చేస్తున్న సంక్షేమ గురుకులాల వ్యాయామ ఉపాధ్యాయులు దేశానికి ఎనలేని సేవలు చేస్తున్నట్లుగా అభివర్ణించారు. క్రీడా పోటీలకు వచ్చే విద్యార్థులకు తగిన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేయడానికి తన వంతు సహకారాన్ని అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, నడిగొట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


