DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలోని జన్కపూర్ గ్రామానికి
చెందిన సుమారు 100 మంది మహిళలు పిపి లాండ్ పట్టాల సమస్య గూర్చి మంగళవారం క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించి అతి త్వరలో సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ నీ మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ని అధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లతశ్రీ-శంకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీరామ రావు, మండల యువజన అధ్యక్షులు ప్రశాంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
