గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల పొత్తుల విషయాలు, సీట్ల పెంపకాల మధ్య పలు దఫలుగా చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. ఇన్ని రోజుల తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారు అయ్యింది. పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్లకు మొత్తం 4 సీట్లు ఇచ్చేందుకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లను కేటాయించింది. వైరా, మిర్యాలగూడ అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించింది. కొత్తగూడెం, చెన్నూరు సెగ్మెంట్లను సీపీఐ పార్టీలకు ఖరారు చేసింది. కాగా, కమ్యూనిస్టులు కోరిన మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఇక, కాంగ్రెస్ కేటాయించిన నాలుగు స్థానాల్లో సీపీఎం, సీపీఐ నుండి ఎవరు బరిలోకి దిగుతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇన్ని రోజులుగా కుదరని పొత్తు నేటితో కుదరడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండవ జాబితాను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఫ్లాష్ న్యూస్: కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల పొత్తు ఖరారు...!
October 20, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలలో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి.
Tags