Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ప్రవళిక కేసులో శివరాం రాథోడ్ అరెస్ట్.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో శుక్రవారం లొంగిపోయాడు.





వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా బిక్కోజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాదులోని అశోక్‌నగర్‌ బృందావన్ హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో పరిచయమైన శివరాం రాథోడ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు తరచూ ఛాటింగ్ చేసుకునేవారు, కలుసుకునేవారు. ప్రవళికను వివాహం చేసుకోకుండా శివరాం రాథోడ్ వేరే యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయం ప్రవళికకు తెలియడంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవళిక మనస్థాపం చెంది హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఈ నెల 13వ తేదీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను శివరాం రాథోడ్ చేతిలో మోసపోయానని సోదరుడు ప్రణయ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతి విషయం తెలుసుకున్న శివరాం రాథోడ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న చిక్కపల్లి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసి వెతుకుతుండడంతో నాంపల్లి కోర్టులో లొంగుబాటు పిటీషన్ వేశాడు. దానిని కోర్టు అంగీకరించడంతో కోర్టులో శివరాం లొంగిపోయాడు. కాగా శివరాంను రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు కోర్టులో పిటీషన్ వేయగా కోర్టు శివరాం రాథోడ్‌ను రిమాండ్‌కు ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.