DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకుల శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని, రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే... మరింత అభివృద్ధి చేయడానికి తోడుపడతాడని, కావున ప్రతి ఒక్కరూ... బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.