DBN TELUGU:- తాండూర్ మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శంకుస్థాపనలు చేశారు.
ముందుగా మహిళలకు బతుకమ్మ చీరలు, యువతకు స్పోర్ట్స్ కిట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకే స్పోర్ట్స్ కిట్లు అందజేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రణయ్ కుమార్, జెడ్పిటిసి బాణయ్య, సర్పంచ్ శంకర్, ఎంపిటిసి శ్రీదేవి శ్రీరాములు, శంకర్, సోషల్ మీడియా వారియర్ ముదం రఘు, నాయకులు మాసాడి తిరుపతి,రేపక రమేష్, ఎల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

