DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో మతిస్థిమితం లేక రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా లోని తాండూర్ మండలంలోని చంద్రపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ శ్రీకాంత్ మతి స్థిమితం లేక అక్టోబర్ 4వ తారీకు బుధవారం రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎంత వెతికిన దొరకకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఇంట్లోంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి శనివారం రేచిని రైల్వే స్టేషన్ నుండి బెల్లంపల్లి స్టేషన్ మధ్యనున్న ప్రదేశంలో గుర్తు తెలియని రైల్ ఢీకొనడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.