DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి నోడల్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 9న ఎన్నికల కార్యచరణ ప్రకటించినందున ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందని, నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల, 10వ తేదీ నామినేషన్ సమర్పించేందుకు ఆఖరు తేది అని, 13న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. 2వ ఓటరు నమోదు. కార్యక్రమం ప్రకారం జిల్లా మొత్తం ఓటర్లు 6 లక్షల 17 వేల 901 ఉండగా పురుషులు 3 లక్షల 08 వేల 630 మంది, స్త్రీలు 3 లక్షల 9 వేల 229 మంది, ఇతరులు 42 మంది ఉన్నారని, 10 వేల 192 మంది దివ్యాంగ ఓటర్లు, 7 వేల 612 మంది వయోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ. 29 మంది, 627 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, జిల్లాలో 002-చెన్నూర్ (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 003–బెల్లంపల్లి (ఎస్.సి.), 004–మంచిర్యాల నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 10 ఫ్లయింగ్ స్వ్కాడ్, 10 స్టాటిక్ సర్వేయలెన్స్, 4 వీడియో సర్వేయలెన్స్, 3 వీడియో పరిశీలన, 4 సహాయ ఖర్చుల పరిశీలకులు, 3 అకౌంటింగ్ బృందాలు, 1 ఎం.సి.ఎం.సి., 1 కంట్రోల్ రూమ్, 1 జిల్లా ఖర్చుల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదనపు సిబ్బందితో కలిపి 97 సెక్టార్ అధికారులను నియమించడం తెలిపారు, మ్యాన్ప్వర్ నిర్వహణలో భాగంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, రాండమైజేషన్, ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించాలని, శిక్షణ నిర్వహణలో భాగంగా ఎన్నికల కార్యకలాపాలలో పాల్గొనే అధికారుల సామర్థ్యం పెంపుదల, శిక్షణ, వేదికల ఏర్పాట్లు, సామాగ్రి పంపిణీ, రాజకీయ పార్టీలు : అభ్యర్థులు, ఏజెంట్లకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. సామాగ్రి నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి ఫారములు, బ్యాలెట్ పత్రాలు, చెరగని ఇంక్, ఇతర ఎన్నికల సామాగ్రి సేకరణ, పంపిణీ చేయాలని, రవాణా నిర్వహణలో భాగంగా ఎన్నికలలో ఉ పయోగించవలసిన అన్ని రకాల రవాణా అవసరాలు, లభ్యత, కొరత ఏర్పడినప్పుడు ఇతర జిల్లాల నుండి సర్దుబాటు, జిల్లాలో కేటాయింపు చర్యలు తీసుకోవాలని, కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీలో భాగంగా సైబర్ సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా జిల్లా వెబ్సైట్ నవీకరణ, సి.ఐ.టి. పనితీరు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పర్యవేక్షణ, వెబ్కాస్టింగ్ ఏర్పాటు, సాంకేతిక మద్దతు అందించడం జరుగుతుందని, స్వీప్ భాగంగా ప్రణాళికను ఖరారు చేసే బాధ్యత, సర్వే, ఓటర్ల నమోదును పెంచే మార్గాలను రూపొందించడం ఎన్నికల ముందు, తరువాత స్వీప్ డాక్యుమెంట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, జిల్లా రక్షణ ప్రణాళికలో భాగంగా రోజు వారిగా రక్షణ చర్యల నివేదిక, బలగాల కేటాయింపు, శిక్షణ, బస, రవాణా, క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల అంచనా, రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ.వి.ఎం. నిర్వహణలో భాగంగా ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్ల లభ్యత, పంపిణీ, మొదటి స్థాయి తనిఖీ, రాండమైజేషన్ వంటి వివిధ కార్యకలాపాల కోసం కార్యచరణ రూపకల్పన చేయడం జరుగుతుందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్స్ భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, మీడియా మొదలైన వాటి కార్యకలాపాలపై ప్రతి రోజు నివేదికను రూపొందించడం, సి-విజీల్ ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని, ఖర్చుల పర్యవేక్షణలో భాగంగా రాజకీయ పార్టీల అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణ, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై శిక్షణ, జిల్లాలోని రిబర్నింగ్ అధికారులు, ఇతర నోడల్ అధికారుల సమన్వయంతో నివేదికలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పేపర్ / డమ్మీ బ్యాలెట్ షీట్ / బ్రెయిలీ బ్యాలెట్ ముద్రణ, ప్రింటింగ్ ప్రెస్, అసెంబ్లీ నియోజకవర్గాలలో పంపిణీ సంబంధిత అంశాల పర్యవేక్షణ, మీడియా, సోషల్ మీడియా నిర్వహణలో భాగంగా ఎన్నికల సంబంధిత సమాచారం, పత్రికా ప్రకటనలు, ప్రెస్ సమావేశాల ఏర్పాట్లు, పత్రికా కత్తిరింపుల సమర్పణ, మీడియాతో సమాచార మార్పిడి, రోజు వారి నివేదికల నిర్వహణ, పెయిడ్ న్యూస్ కేసుల సమీక్ష, సోషల్ మీడియాపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. కమ్యూనికేషన్ ప్లాన్, దివ్యాంగుల సౌకర్యాల నిర్వహణలో భాగంగా జిల్లా కమ్యూనికేషన్ కార్యచరణ సిద్ధం చేసి భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ అప్లోడ్ చేయడం, పోలింగ్ పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాలలో కమ్యూనికేషన్ ఏర్పాట్లు, దివ్యాంగ ఓటర్లకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎలక్టోరల్ రోల్ నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా సవరణ, జాబితా నిర్వహణ, ఎపిక్ కార్డుల తయారీ, ముద్రణ, పంపిణీ చేయడం జరుగుతుందని, ఫిర్యాదుల పరిష్కారం, ఓటర్ హెల్ప్ లైన్ నిర్వహణలో భాగంగా నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, జిల్లాలోని ఓటరు హెల్ప్ లైన్ 1950 నిర్వహణ చేయడం. జరుగుతుందని తెలిపారు, ఎన్నికల సమయంలో నియమించబడిన సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులకు సంబంధించి అన్ని విషయాల కొరకు జిల్లా స్థాయి సమన్వయకర్తగా కోసం అధికారుల జాబితాను అందించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారుల సమన్వయం, లైజన్ అధికారుల ఏర్పాటు, రీడింగ్ సామాగ్రి, రవాణా, భద్రత, టెలిఫోన్ కనెక్టివిటీ, కంప్యూటర్లు, ప్రింటర్లు, మొదలైన అంశాలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు నియమించబడిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.