DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం లో బెల్లంపల్లి మండలంలోని
ఆకెనపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువకులు రెడ్డి దీక్షిత్, సుదమల్ల ప్రణయ్ కుమార్, సుధమల్ల సాయి తేజ, సుదమల్ల వరప్రసాద్, కురిమిండ్ల మణిదీప్, బోరిగం సాయికృష్ణ, పొట్లచెర్ల రమేష్, వేల్పుల రాకేష్ తదితరులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి, తాము బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, నాయకులు రెడ్డి పోశం, వంజరి అశోక్, ఆగిడి వెంకటేష్, పోలవేణి శ్రీనివాస్, తోకల రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.