DBN TELUGU:- కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బంజారాహిల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న రూ.3.25 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా... ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూల్స్ ప్రకారం రూ.50 వేల వరకు మాత్రం నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళితే దానికి తగిన ఆధారాలు చూపాలి. ఆ డబ్బుకు డబ్బుకు సంబంధించిన సరైన రశీదులు, పత్రాలు వెంటబెట్టుకుని వెళ్లాలి. లేదంటే పోలీసులు ఆ డబ్బును సీజ్ చేస్తారు.