ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 5వ తేదీన నాంపల్లి పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర పదాధికారులు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ రెండు సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నట్లు స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికలకు గాను రాష్ట్ర నాయకులకు నడ్డా నాయకులకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఖరారైన అభ్యర్థుల వివరాలను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీకి పంపుతామని వెల్లడించారు. తరువాత వారు పరిశీలించిన అనంతరం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసి ఢిల్లీ నుంచే తొలి జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్: వచ్చే వారంలో బిజెపి ఫస్ట్ లిస్ట్: కిషన్ రెడ్డి.
October 02, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టును అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసే అవకాశముందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.
Tags
