DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు మరియు బెల్లంపల్లి
నియోజకవర్గం లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృధి పనులకు ఆకర్షితులై బెల్లంపల్లి మండల కాంగ్రెస్ యువ నాయకులు చిలుముల సాయి కుమార్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందిస్తుందని, వాటికి ఆకర్షితులై తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.