DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలో పసుపులేరు వాగు వంతెన వద్ద కారు-లారీ ఆదివారం రాత్రి ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ ముగ్గురు యువకులే. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన స్థానికులు చికిత్స అందిస్తున్నారు. కాగా... మృతి చెందిన వారి వివరాలు చూసుకుంటే శావల్యాపురం మండలంలోని ముండ్రువారిపాలెంకు చెందిన నవీన్, కనుమరలపూడి కి చెందిన యెహోషువ, వినుకొండకు చెందిన శివారెడ్డి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
