DBN TELUGU:- ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కెరీర్ ను ఉన్నతంగా మలుస్తుందని ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణులు కొక్కుల ప్రవీణ్ కుమార్ అన్నారు.
సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ లో జరిగిన లెక్చర్స్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు సాఫ్ట్ వేర్ రంగంతోపాటు ఎంటర్ ప్రెన్యూర్షిప్ భవిష్యత్ అవకాశాలపై విద్యార్ధులు అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న సమాధానం పద్దతిలో ఈ లెక్చర్ విద్యార్ధుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా సాగింది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్య్తక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జాతిపిత మహాత్మా గాంది చిత్రపఠానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ను ప్రిన్సిపాల్ ఐనాల సైదులు జడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ లతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ పూర్వ అధ్యక్షులు దాగం మహేష్, సభ్యులు అడ్డూరి వెంకటస్వామి, రాజు, గోగర్ల రమేష్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, అధ్యాపకులు యండి రఫి, ఆకెనేపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


