DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గత వారం రోజులుగా
మంచినీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ విషయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, మందమర్రి ఏరియా జీఎంతో ఫిల్టర్ బెడ్ శుద్ధి చేసి ఏ సమస్యలు లేకుండా పట్టణ ప్రజలకు వెంటనే మంచినీటి సరఫరా చేయాలని చెప్పగా... సింగరేణి అధికారులు ఫిల్టర్ బెడ్ లో ఇసుకను మార్చి మొత్తం శుద్ధి చేసి శనివారం నుండి పూర్తి స్థాయిలో అన్ని బస్తీలకు మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఒకవైపు దసరా పండగ ఉండడంతో మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో సమస్య తెలిసిన వెంటనే స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి... మంచినీటి సరఫరా పునరుద్ధరణకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్యకి పట్టణ ప్రజలు, తెలంగాణ జాగృతి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. జాగృతి నాయకులు మాట్లాడుతూ... ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తనదైన శైలిలో నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపే మన ఎమ్మెల్యే చిన్నయ్య వెంటే నియోజకవర్గ ప్రజలు నిలిచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో జాగృతి నాయకులు వంశీనాథ్, రాజశేఖర్, కరుణాకర్, రాకేష్, మౌనిక్, బన్నీ, నాని, మహంతి, బన్నీ ఉన్నారు.