వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి మేడ్చల్ జిల్లా చింతల్ గ్రామానికి చెందిన చెలిమెల రామచందర్రావు (40) అతని చిన్న కూతురు చెలిమెల జనని (14) కుటుంబ సభ్యులతో కలిసి పర్బానీ ఎక్స్ప్రెస్ లో బాసరకు పుణ్యక్షేత్ర దర్శనానికి రైలులో బయలుదేరారు. ఐతే నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. రామచంద్ర రావు చిన్న కూతురు జనని వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. వాటర్ బాటిల్ కొనుగోలు చేసే లోపే ట్రైన్ కదలడంతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి బాలిక ప్లాట్ ఫారం మధ్య ఇరుక్కు పోయింది. దీంతో ఆమెను కాపాడేందుకు తండ్రి యత్నించాడు. బాలిక అక్కడికక్కడే చనిపోగా, ఆమె తండ్రి నీ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్రేకింగ్ న్యూస్: ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కుని బాలిక మృతి...!
October 20, 2023
0
DBN TELUGU:- బాసరకు పుణ్యక్షేత్ర దర్శనానికి అని వెళ్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన సంఘటన చోటుచేసుకుంది.
Tags