DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తప్పకుండా మూడవసారి గెలుస్తాడని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రోజు రోజుకి ఇతర పార్టీల నుండి భారీగా వలసలు పెరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం తాండూర్ మండలం లోని బోయపల్లికి చెందిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరుతూ పార్టీ బలపేదానికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల తో కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.