DBN TELUGU:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ సెమినార్.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహణ.
- వ్యాపార వ్యవస్థ-నిర్వహణ-భాగస్వామ్యం అనే అంశంపై కార్యక్రమం.
- ఆసక్తిగా పాల్గొన్న కళాశాల కామర్స్ విద్యార్థులు.
-- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కామర్స్ సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఏం గోపాల్ సహకారంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. " వ్యాపార వ్యవస్థ-నిర్వహణ-భాగస్వామ్య వ్యాపారం" అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం గోపాల్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.ఎస్ ప్రవీణ్ కుమార్, అకాడమిక్ కో ఆర్డినేటర్ పి. శ్రీలత హాజరయ్యారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో వ్యాపార రంగంపై ఇంత మంచి సెమినార్ ను నిర్వహించడంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
- వ్యాపార వ్యవస్థపై అవగాహన.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ కర్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ... బీకాం చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో అనేక ఉపాధి మార్గాల వైపు వెళ్లడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా వ్యాపార సంబంధిత రంగంలో అనేక విధాలుగా భాగస్వామ్యం కావచ్చని వివరించారు. వ్యాపార వ్యవస్థ ఎలా ఉంటుంది, వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి, వ్యాపారంలో ఏ కోణాల్లో భాగస్వామ్యం కావచ్చు అనే అంశాలు అన్నీ క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా కామర్స్ విద్యార్థినిలు పనాస శ్రీ కీర్తన, సింగతి అనూష, చిర్ర గోపిక, చంద్రగిరి వజ్ర తదితరులు వ్యాపార వ్యవస్థ నిర్వహణపై తమ మాటలతో ఆకట్టుకున్నారు. డిగ్రీ మూడు సంవత్సరాల కామర్స్ విద్యార్థులంతా ఈ ముఖ్యమైన సెమినార్ ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం గోపాల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి శ్రీలత, సెమినార్ నిర్వహణ కర్త డాక్టర్ కాంపల్లి శంకర్, కామర్స్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడ తిరుపతి, అధ్యాపకులు పి.రవి, కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.